: బాధతో పూరీ పంచుకున్న అభిప్రాయాలు... పూర్తి పాఠం!


నిన్న సిట్ అధికారుల ముందు సుమారు 11 గంటల పాటు విచారణను ఎదుర్కొన్న దర్శకుడు పూరీ జగన్నాథ్, తన అభిప్రాయాలను, మనసులోని బాధను ఓ వీడియో ద్వారా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో పూరీ ఏమన్నారంటే...
"ఈ ఆఫీసుకు వెళ్లాను నేను. అక్కడ సిట్ ఆఫీసర్స్ నా మీద ఉన్న ఎలిగేషన్స్ గురించి చాలా ప్రశ్నలు వేశారు. వాటన్నింటికీ సమాధానం చెప్పాను. కెల్విన్ ముఠాతో పరిచయం లేదని, కెల్విన్ ను నేనెప్పుడూ కలవలేదని క్లియర్ గా చెప్పాను. సో... మళ్లీ వాళ్లెప్పుడు పిలిచినా వెళ్లటానికి నేను రెడీగా ఉన్నాను. బేసికల్ గా నేను ఎప్పుడూ వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్ ను. ఎనీథింగ్ ఇల్లీగల్... నాట్ ఓన్లీ డ్రగ్స్... నేనెప్పుడూ చేయను. ఇల్లీగల్ అయితే మాత్రం అలాంటి పనులు నేనెప్పుడూ లైఫ్ లో చేయలేదు, చేయను కూడా. అండ్... ఇవాళ నేను పోలీస్ డిపార్టుమెంట్ గురించి పాజిటివ్ గా... నాకు పోలీస్ డిపార్టుమెంట్ అంటే చాలా ఇష్టం. చాలా సినిమాలు చేశాను నేను డిపార్ట్ మెంట్ గురించి.

జర్నలిస్టుల మీద ప్రేమతో 'ఇజం' అనే సినిమా చేశాను నేను. కానీ, నాకు చాలా బాధగా ఉంది. ఇవాళ, అన్ని చానల్స్ లో ఉన్న మీడియా మిత్రులంతా నాకు నిజంగా ఫ్రెండ్సే. మేము వన్ టూ వన్ కలుస్తాం. అందరమూ మాట్లాడుకుంటాం. కాఫీ తాగుతాం. ఇంత ఫ్రెండ్లీగా ఉన్న వీళ్లు, మరి టైం కమ్స్... లైక్... వాళ్లు చేసిన ప్రాబ్లమ్స్, వాళ్లకు తెలిసినా తెలియకపోయినా కట్టుకథలు చేసి, హాఫెనవర్ ప్రోగ్రాములు చేసి... నిజంగా చెప్పాలంటే, జీవితాలను నాశనం చేశారండీ. మా అమ్మ, నా వైఫ్, పిల్లలు, అన్నదమ్ములు నాలుగు రోజుల నుంచి ఏడుస్తూనే ఉన్నారు. నేనే కాదు... చాలా కుటుంబాల వాళ్లు అందరూ. నాకు నిజంగా మీడియా మీద చాలా బాధగా ఉంది. ఎందుకంటే, నాకు అందరూ తెలుసు. రేపు మళ్లీ మనం కలుస్తాం కూడా. బట్... చాలా డిస్టర్బ్ చేశారు. ఏదైనా ఉంటే రేపు సిట్ ఆఫీసర్లే డిసైడ్ చేస్తారు" అని అన్నాడు పూరీ జగన్నాథ్.

  • Loading...

More Telugu News