: ఢిల్లీలో ఘనంగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడి వివాహ విందు.. కొత్త దంపతులను ఆశీర్వదించిన ప్రధాని!


ఢిల్లీలోని ఓ హోటల్‌లో నిర్వహించిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వివాహ విందుకు ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. అలాగే కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, సురేశ్ ప్రభు, పీయూష్ గోయల్, ప్రకాశ జవదేకర్, తోమర్, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరితోపాటు పలువురు టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ నేతలు హాజరయ్యారు. కాగా, విందుకు హాజరైన ప్రధాని మోదీకి కొత్త దంపతులు రామ్మోహన్ నాయుడు, శ్రావ్యలు పాదాభివందనం చేయాగా, వారిని మోదీ ఆశీర్వదించారు. విందులో పాల్గొన్న నేతలు ఉత్సాహంగా గడిపారు. రామ్మోహన్ నాయుడు పెళ్లి ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News