: డ్రగ్స్ సరఫరా చేసిన ఆయా కొరియర్ కంపెనీలకు నోటీసులు ఇచ్చాం: అకున్ సబర్వాల్
డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ను సుమారు పదకొండు గంటల పాటు అధికారులు విచారణ చేశారు. ఈ విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటపడినట్టు సమాచారం.ఈ వ్యవహారానికి సంబంధించి మూడు కొరియర్ కంపెనీలకు నోటీసులు ఇచ్చామని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేసిన డీహెచ్ఎల్, బ్లూడాట్, ఫెడెక్స్ కొరియర్ సంస్థలకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఆయా కొరియర్ల ప్రతినిధులను సిట్ విచారణకు హాజరు కావాలని చెప్పామని, పోస్టల్ పార్శిల్ ద్వారా కూడా డ్రగ్స్ రావడంతో పోస్టు మాస్టర్ జనరల్ కు ఈ మేరకు ఓ లేఖ రాశామని చెప్పారు.