: కొత్త ఇరవై రూపాయలను విడుదల చేయనున్న ఆర్బీఐ!


గత ఏడాది డిసెంబర్ లో కొత్త ఇరవై రూపాయలు, యాభై రూపాయల నోట్లను విడుదల చేస్తామని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)  ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త 20 రూపాయల నోట్లను త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. 2005 కొత్త సిరీస్‌లో భాగంగా కొత్త 20 రూపాయల నోట్లు ఉంటాయని, ఈ నోట్ల నంబర్ ప్యానెల్‌లో 'ఎస్' అనే అక్షరం ఉంటుందని సమాచారం. పాత రూ.20 నోట్లు కూడా చట్టబద్ధంగా చలామణిలో ఉంటాయని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News