: డ్రగ్స్ వ్యవహారంలో నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడను: హీరో విశాల్
డ్రగ్స్ వ్యవహారంలో నిజానిజాలు తేలకముందే నటులపై నిందారోపణలు చేయడం సబబు కాదని నడిగర్ సంఘం కార్యదర్శి, ప్రముఖ సినీ నటుడు విశాల్ అన్నాడు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, అధికారులు విచారణ చేస్తున్న తరుణంలో తాను స్పందించడం సబబు కాదని అన్నాడు. వాస్తవాలు తెలుసుకోకుండా చేసే వ్యాఖ్యలతో నటులు మనస్తాపం చెందుతారని, అది వారి మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని, ఈ వ్యవహారంపై మొత్తం విచారణ పూర్తయ్యాక తాను స్పందిస్తానని చెప్పాడు. పిల్లలు డ్రగ్స్ వాడకంపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా విశాల్ కోరాడు.