: శ్రీలంక పర్యటనకు వెళ్తూ.. విమానంలో సెల్ఫీలు తీసుకున్న టీమిండియా


ఈ నెల 26 నుంచి శ్రీలంక‌, భార‌త్ క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య సిరీస్ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఇందులో పాల్గొన‌డానికి బ‌య‌లుదేరిన టీమిండియా ఆట‌గాళ్లు ఈ రోజు ముంబయికి చేరుకుని విమానంలో ఫొటోలు దిగి త‌మ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. టీమిండియా సార‌థి విరాట్ కోహ్లీ.. కేఎల్ రాహుల్ తో సెల్ఫీ దిగి ఫ్లైట్ కాస్త ఆల‌స్య‌మైంద‌ని, ఆ స‌మ‌యంలో సెల్ఫీ దిగానని అన్నాడు. శిఖర్‌ధావన్ కూడా సహచరులతో కలిసి దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేశాడు. అందులో ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్ ఉన్నారు. శ్రీలంక పర్యటన‌ కోసం తామంతా ముంబయిలో క‌లుసుకున్నట్లు తెలిపారు. 

  • Loading...

More Telugu News