: ఇంటికి వెళ్లడానికి ఒప్పుకున్న పూర్ణిమ సాయి
సీరియళ్లలో నటించాలన్న కోరికతో ఎవ్వరికీ చెప్పకుండా హైదరాబాద్ నుంచి ముంబయికి వెళ్లిపోయిన బాలిక పూర్ణిమ సాయి ఇంటికి వెళ్లడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చిన సైకాలజిస్టులు ఎట్టకేలకు తల్లిదండ్రులతో వెళ్లేందుకు ఆమెను ఒప్పించారు. మొదట పూర్ణిమ సాయి తాను తన తల్లిదండ్రుల మొహం చూడబోనని, చూస్తే వారికి కీడు జరుగుతుందని తనకు కల వచ్చిందని చెప్పిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఆమెను ముంబయి నుంచి తీసుకొచ్చిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ రోజు ఆమెను పోలీసులు తల్లిదండ్రులతో ఇంటికి పంపించనున్నారు.