: బీజేపీ సీనియర్ నేత అద్వానీకి భారతరత్న?
1942లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరిన నాటి నుంచి ఇప్పటివరకు తమ పార్టీ కోసం బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ కష్టపడుతూనే ఉన్నారు. అయితే, కోర్టు కేసులలో నేరారోపణలు ఉన్నాయనే నెపంతో రాష్ట్రపతి పదవి విషయంలో అద్వానీని సైడ్‌లైన్ చేశారని బీజేపీలో ఒక వర్గం అభిప్రాయపడుతోంది. వారి అభిప్రాయాలను పటాపంచలు చేసేందుకు ఇప్పుడు బీజేపీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఎల్.కె. అద్వానీకి సానుకూలంగా ఉన్న వర్గాన్ని సంతృప్తి పరచడానికి ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించే యోచనలో బీజేపీ ఉందని వార్తలు వస్తున్నాయి. వీటిలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉన్నా, ఈ వార్త మాత్రం అద్వానీ అనుకూల వర్గాన్ని శాంతపరిచేలా కనిపిస్తోంది.