: ఇక యూట్యూబ్ వీడియోలు వాట్సాప్‌లో!


వాట్సాప్‌లో ఇత‌రులు పంపించిన యూట్యూబ్ లింక్‌ల‌ను చూడాలంటే ఇక‌ యూట్యూబ్ ఓపెన్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. వాట్సాప్ చాట్‌లోనే చూడ‌గ‌లిగే సౌక‌ర్యాన్ని వాట్సాప్ క‌లిపించింది. ఇందుకు సంబంధించిన అప్‌డేట్‌ను ఐఫోన్ 6ఎస్‌, ఐఫోన్‌7 లాంటి హై రెజ‌ల్యూష‌న్ ఫోన్ల‌కు పంపించింది. ఈ సౌక‌ర్యం ద్వారా యూట్యూబ్ వీడియోల‌ను సుల‌భంగా పంచుకునే అవ‌కాశం క‌లుగుతుంద‌ని వాట్సాప్ పేర్కొంది. దీనితో పాటు ఈ అప్‌డేట్‌లో మ‌రికొన్ని సౌక‌ర్యాలు కూడా వాట్సాప్ క‌ల్పించ‌నుంది. ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో వాట్సాప్ క‌ల్పించిన సౌక‌ర్యాలు ఆపిల్ ఫోన్ల‌లో లేవు. ఈ మేర‌కు ఆపిల్ వినియోగ‌దారుల నుంచి వాట్సాప్‌కు ఫిర్యాదులు అందాయి. వారి సౌక‌ర్యార్థ‌మే ఈ నూత‌న అప్‌డేట్లు పంపిస్తున్న‌ట్లు వాట్సాప్ తెలిపింది.

  • Loading...

More Telugu News