: 'జగ్గా జాసూస్' నటి బిదిశ మరణం వెనుక భర్త కుట్ర... అరెస్ట్


అస్సామీ నటి, గాయని, ఇటీవలి రణబీర్ కపూర్ చిత్రం 'జగ్గా జాసూస్'లో నటించిన బిదిశా బెజ్ బారువా మరణం వెనుక భర్త నితీశ్ హస్తం ఉందన్న అనుమానంతో ఈ ఉదయం గురుగ్రామ్ పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. సోమవారం సాయత్రం గురుగ్రామ్ లోని ధనవంతులు నివసించే శుశాంత్ లోక్ ప్రాంతంలోని తన ఇంట్లో బిదిశ ఫ్యానుకు ఉరివేసుకుని మరణించిన స్థితిలో కనిపించిన సంగతి తెలిసిందే. ఎన్నో స్టేజ్ షోలు, టీవీ సీరియల్స్ లో కనిపించి మెప్పించిన ఆమె మరణం వెనుక నితీశ్ కుట్ర ఉందని బిదిశ తండ్రి సహారన్ ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. నితీశ్ ను తన కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకుందని, ఆపై పలుమార్లు వారిద్దరి మధ్యా గొడవలు జరిగాయని తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నట్టు తెలుస్తోంది. అతని మొబైల్ ఫోన్ లోని మెసేజ్ లు, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో భార్యతో జరిగిన వివాదం ప్రాథమిక సాక్ష్యాలుగా నితీశ్ ను విచారించనున్నట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News