: పూరీని విచారిస్తున్న గదిలోకి మానసిక వైద్యుడు!
ఎక్సైజ్ కార్యాలయంలోని ఐదో అంతస్తులో అరగంట క్రితం దర్శకుడు పూరీ జగన్నాథ్ విచారణ ప్రారంభం కాగా, 20 నిమిషాల తరువాత, అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న మానసిక వైద్యుడిని లోపలికి పిలిపించుకున్నట్టు తెలుస్తోంది. సిట్ సిబ్బంది బయటకు చేరవేసిన సమాచారం ప్రకారం, తొలుత పూరీ యోగక్షేమాలు, తాజా చిత్రాల వివరాలు అడిగిన అధికారులు, అసలు ప్రశ్నలు ప్రారంభించే సరికి సరైన సమాధానాలు చెప్పడం లేదని భావించిన మీదటే, కాసేపు వైద్యుడితో కౌన్సెలింగ్ ఇప్పించి, సమాధానాలు చెప్పకుంటే జరిగే పరిణామాలను ఆయనకు వివరించాలని అధికారులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఆయన సమాధానాలను ఇచ్చే తీరును డాక్టర్ నిశితంగా గమనిస్తారని, అవసరమైతే వైద్య సాయం చేస్తారని చెబుతున్నారు. కాగా, ఈ విచారణను పర్యవేక్షించేందుకు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ సైతం స్వయంగా రంగంలోకి దిగారు. ప్రస్తుతం విచారణ గదిలో పూరీతో పాటు ముగ్గురు అధికారులు, ఓ మానసిక వైద్యుడు ఉన్నారు.