: టీమిండియా క్రికెటర్ ఉమేశ్ యాదవ్ ఇంట్లో చోరీ!
నాగ్‌పూర్‌లోని లక్ష్మీనగర్ ఏరియాలోని టీమిండియా క్రికెటర్ ఉమేశ్ యాదవ్ ఇంట్లో చోరీ జరిగింది. ఆయన ఫ్లాట్‌లోకి ముగ్గురు దొంగలు ప్రవేశించి రూ.45 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లను దొంగిలించారు. ఈ చోరీ నిన్న రాత్రి 7 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో జరిగిందని పోలీసులు తెలిపారు. సదరు క్రికెటర్ ఇంటిపై భాగంలో ఉన్న కిటికీ అద్దాలు పగులగొట్టి దొంగలు లోపలికి చొరబడ్డారని తెలిపారు. ఇటీవల ఆ బిల్డింగ్‌లోని ఓ అంతస్తులో రిపేర్ పనులు చేశారు. ఆ వ్యక్తులే ఈ చోరీ చేసుంటారని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు వారిలో ఒకరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.