: హుస్సేన్ సాగర్ లో పెరిగిన నీటిమట్టం!
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో నీటిమట్టం పెరిగింది. ఇన్ ఫ్లో 2 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 600 క్యూసెక్కులుగా ఉన్నట్టు ఇరిగేషన్ శాఖ అధికారి శేఖర్ రెడ్డి తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 169 చెరువుల్లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరినట్టు చెప్పారు. హుస్సేన్ సాగర్ పరీవాహక నాలాల చుట్టూ ఉన్న కాలనీల ప్రజలను అప్రమత్తం చేశామని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి హెచ్చరించారు.