: నూనెను మరుగబెట్టి తీసుకొచ్చి.. భ‌ర్త‌పై పోసిన భార్య‌!


త‌న భ‌ర్త‌పై ఓ మ‌హిళ మ‌రుగుతున్న నూనెను పోసిన ఘ‌ట‌న ముంబైలో చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంట ప్ర‌తిరోజు గొడ‌వప‌డుతూ చివ‌ర‌కు ఇప్పుడు విడిపోయే స్థితికి వ‌చ్చారు. భరత్ అనే యువ‌కుడు జయ అనే యువ‌తిని 2011లో తొలిసారి పుణె-ముంబై రైలులో కలిశాడు. ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి, పెళ్లి చేసుకున్నారు. భార్య‌ జయ పుణెలో ఉంటూ సేల్స్‌ వుమెన్‌గా ప‌నిచేస్తోంది. భరత్ ముంబైలో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. వారానికి ఒక్క‌రోజు వారిద్దరూ కలుసుకుంటారు.

ఈ క్రామంలో జయ త‌న‌ పుట్టినరోజు కావ‌డంతో పుణెకు వ‌చ్చిన త‌న భ‌ర్త‌తో హ్యాపీగా గ‌డిపింది. అయితే, రాత్రిపూట‌ తనను కూడా ముంబై తీసుకెళ్లాలని ఆమె త‌న భ‌ర్త‌ను కోరింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ చెల‌రేగింది. భరత్ ఆగ్ర‌హంగా వెళ్లి తన బెడ్రూంలో పడుకున్నాడు. భ‌ర్త‌పై మండిపోయిన‌ జయ వంటగదిలోకి వెళ్లి నూనెను మరగబెట్టి అతనిపై పోసింది. దీంతో భ‌ర‌త్‌ ఛాతిపై, కడుపుపై, కాలిపై గాయాలయ్యాయి. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. భ‌ర‌త్‌ ఆమెను హింసిస్తున్నాడని, జ‌య‌ని డబ్బు కోసమే వాడుకుంటున్నాడని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. తన భార్యను పుణెలో ఉంచుతున్న భరత్ ఆమె సంపాదించే డబ్బును తీసుకెళ్లడానికే అక్కడకు వారానికి ఓ సారి వస్తాడని చెబుతున్నారు. 

  • Loading...

More Telugu News