: నెగ్గిన రవిశాస్త్రి పంతం... బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్‌ను నియమించిన బీసీసీఐ
టీమిండియా ప్రధాన కోచ్‌గా ఇటీవలే ఎంపికైన రవిశాస్త్రి ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇటీవల బీసీసీఐ టీమిండియాకు బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్‌ను, బ్యాటింగ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే, బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్ పనికిరాడని ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి భరత్ అరుణ్ సమర్థుడని, ఆయననే నియమించాలని రవిశాస్త్రి బీసీసీఐని కోరారు. భరత్ అరుణ్ కి విదేశాల్లో అపార అనుభవం ఉందని కూడా చెప్పారు. దీంతో ఎట్టకేలకు భరత్ అరుణ్‌నే బౌలింగ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు బీసీసీఐ ఈ రోజు ప్రకటించింది. అలాగే టీమిండియా సహాయ కోచ్‌గా సంజయ్ బంగర్‌ను నియమిస్తున్నట్లు పేర్కొంది. రవిశాస్త్రితో పాటు సంజయ్, భరత్‌లు వచ్చే ప్రపంచకప్ వరకు తమ పదవుల్లో కొనసాగుతారు.