: శ్రీలంకలో ఏపీ ఇండస్ట్రియల్ పార్క్


శ్రీలంక‌లో పారిశ్రామిక పార్కు ఏర్పాటు నిమిత్తం ఆ దేశ ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి కార్యాల‌యం కూడా ప్రెస్‌నోట్ విడుద‌ల చేసింది. పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం 600 ఎక‌రాల భూమిని కేటాయించ‌డానికి శ్రీలంక అంగీక‌రించింది. అమ‌రావ‌తిలోని వెల‌గ‌పూడి స‌చివాల‌యంలో చంద్ర‌బాబు శ్రీలంక ప్ర‌తినిధుల‌తో భేటీ అయ్యారు.  ఈ పారిశ్రామిక పార్కు ద్వారా శ్రీలంక‌లో టూరిజం, ఫార్మా, హార్టిక‌ల్చ‌ర్ రంగాలు అభివృద్ధి చెందుతాయ‌ని చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు. త్వ‌ర‌లోనే రాష్ట్రం నుంచి అధ్య‌య‌నం కోసం ఒక ప్ర‌తినిధుల బృందాన్ని శ్రీలంక‌ పంపించ‌నున్నారు.

  • Loading...

More Telugu News