: హాలీవుడ్ లో రీమేక్ కానున్న తొలి హిందీ చిత్రం!


గతంలో హాలీవుడ్ లో నిర్మితమై సూపర్ హిట్ అయిన ఎన్నో చిత్రాలను భారత సినీ పరిశ్రమ రీమేక్ చేసిన ఉదంతాలు మనకు తెలిసినవే. అయితే, చలన చిత్ర చరిత్రలో తొలిసారిగా ఓ హిందీ చిత్రం హాలీవుడ్ లో రీమేక్ కు సిద్ధమైంది. గత సంవత్సరం హృతిక్ రోషన్, యామీ గౌతమ్ హీరో హీరోయిన్లుగా నటించగా, ఘన విజయం సాధించిన 'కాబిల్' చిత్రాన్ని ఇంగ్లీష్ లో రీమేక్ చేసేందుకు ఫాక్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సిద్ధమైంది.

ఈ చిత్రంలోనూ హృతిక్ నే హీరోగా తీసుకోవాలని ఆ సంస్థ చర్చిస్తోందని దర్శకుడు సంజయ్ గుప్తా వెల్లడించారు. ఇది తమ చిత్ర బృందానికి గర్వకారణమని, అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే హాలీవుడ్ లో రీమేక్ అయ్యే తొలి హిందీ చిత్రం ఇదే అవుతుందని అన్నారు. కాగా, ప్రస్తుతం తన కుటుంబంతో న్యూయార్క్ లో విహారయాత్ర చేస్తున్న హృతిక్, ఇండియాకు వచ్చిన తరువాత, ఈ రీమేక్ పై అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.

  • Loading...

More Telugu News