: తన సహచరుల శాఖలను మార్చిన మోదీ... మారిన శాఖల వివరాలు!


ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు రాజీనామా చేయగా, ఆ వెంటనే దాన్ని ఆమోదిస్తున్నట్టు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. ఇక తన సహచరుల శాఖల్లో స్వల్ప మార్పులు చేయాలని నిర్ణయించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ వెంకయ్య అధీనంలోని పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలను మరో మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు ఇచ్చినట్టు ప్రధాని కార్యాలయం కొద్దిసేపటి క్రితం ఓ ప్రకటనలో తెలిపింది. సమాచార, ప్రసార శాఖల బాధ్యతలను మరో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి అప్పగిస్తున్నట్టు ఈ ప్రకటన వెల్లడించింది.

  • Loading...

More Telugu News