: మరి కాసేపట్లో హైదరాబాద్‌కు పూర్ణిమ.. కోర్టు తీర్పును బట్టి తదుపరి చర్యలు!
సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో ముంబై వెళ్లిపోయి 40 రోజుల తర్వాత పోలీసులకు చిక్కిన పూర్ణిమ మరికొద్ది సేపట్లో హైదరాబాద్ చేరుకోనుంది. ప్రస్తుతం ముంబై పోలీసుల అదుపులో ఉన్న ఆమెను సైబరాబాద్ పోలీసులకు అప్పగించనున్నారు. కాగా, కుమార్తె ఆచూకీ తెలిసి ముంబై వెళ్లిన పూర్ణిమ తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. వారిని చూసేందుకు కూడా బాలిక అంగీకరించకపోవడంతో కుమార్తెను చూడకుండానే వెనుదిరిగారు. దీంతో నేడు ముంబై పోలీసులు పూర్ణిమను హైదరాబాద్ తీసుకొచ్చి సైబరాబాద్ పోలీసులకు అప్పగించనున్నారు. అనంతరం పూర్ణిమను కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టు తీర్పును బట్టి పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.