: 17.5 మీటర్ల ఎత్తులో ఢీకొన్న రెండు రైళ్లు.. థీమ్ పార్క్‌లో ఘటన.. 30 మందికిపైగా గాయాలు
భూమికి 17.5 మీటర్ల ఎత్తులో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ఓ రైలు మరో రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో 33 మందికిపైగా గాయపడ్డారు. అయితే ఈ రైలు సాధారణ ప్రయాణికుల రైలు కాదు. థీమ్ పార్క్‌లోని రోలర్ కోస్టర్ రైలు. మాడ్రిడ్‌లోని ప్రాచీన పార్క్ ది అట్రసియోన్స్ థీమ్ పార్క్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
రోలర్ కోస్టర్‌లో సందర్శకులతో తిరుగుతున్న ఓ రైలులో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆగాల్సిన ప్రదేశంలో ఆగకుండా ముందుకు దూసుకుపోయింది. అదే సమయంలో ట్రాక్‌పై బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న మరో రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో 33 మంది తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదంపై పార్క్ సిబ్బంది, పోలీసులు విచారణ చేపట్టారు.