: కేంద్రానికి నరసింహన్... ఏపీ, తెలంగాణకు వేర్వేరు గవర్నర్లు.. తెలంగాణకు శంకరమూర్తి!


ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కేంద్రానికి వెళ్లబోతున్నారా? ఆయన స్థానంలో కేంద్రం కొత్త గవర్నర్‌ను నియమించనుందా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే నరసింహన్‌కు కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పజెప్పాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి గవర్నర్ పదవీకాలం మేలోనే ముగిసింది. అయితే కేంద్రం ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. ఈ క్రమంలో రాష్ట్రపతి ఎన్నికలు రావడంతో ఉప రాష్ట్రపతి అభ్యర్థుల పేర్లలో ఆయన పేరు కూడా వినిపించింది. ఎన్డీఏ పక్షాల తరపున బీజేపీ ఆయనను బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే ప్రస్తుతం వెంకయ్యనాయుడు బరిలో దిగడంతో నరసింహన్‌కు కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు.

నరసింహన్‌కు గతంలో ఇంటెలిజెన్స్‌లో పనిచేసిన అనుభవం ఉండడంతో అందులోనే ముఖ్యమైన పదవి ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక ఏపీ, తెలంగాణలకు వేర్వేరు గవర్నర్లను నియమించాలని కూడా హోంశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకుడు శంకర్‌మూర్తిని తెలంగాణకు గవర్నర్ గా నియమించనున్నట్టు విశ్వసనీయ సమాచారం.  

  • Loading...

More Telugu News