: బయ్యారం అడవుల్లో ఇద్దరు మహిళా కలెక్టర్ల ఆటవిడుపు!
వరంగల్ అర్బన్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు ఆమ్రపాలి, ప్రీతిమీనాలు ఆట విడుపు కోసం సరదాగా కాసేపు అడవిలో పర్యటించారు. మహబూబాబాద్ లోని బయ్యారం అడవుల్లో సుమారు పది కిలోమీటర్ల మేర నడుస్తూ వెళ్లారు. అలుగు పోస్ట్ లు ఉన్న పెద్దచెరువును పరిశీలించారు. ఆ తర్వాత, పెద్దగుట్ట వద్దకు వెళ్లారు. దీనిని పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ఉన్న అవకాశాలను వారు పరిశీలించారు. వారి వెంట ఇద్దరు అధికారులు, రక్షణగా గన్ మెన్ లు కూడా ఉన్నారు.