: గుప్తనిధుల కోసం... కూతురిని కిడ్నాప్ చేసిన తండ్రి
రంగారెడ్డి జిల్లాలోని బండ్లగూడ పీ అండ్ టీ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ఏడేళ్ల కూతురిని తన భర్త కిడ్నాప్ చేశాడని ఆ చిన్నారి తల్లి ఈ రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుప్తనిధుల కోసమే తన కూతురిని కిడ్నాప్ చేసినట్లు ఆరోపిస్తోంది. ఆమె చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. గుప్త నిధుల కోసం కొందరు క్షుద్రపూజలంటూ నరబలి ఇవ్వడానికి సిద్ధపడిన ఘటనలు గతంలో ఎన్నో చోటు చేసుకున్నాయి.