: ఆదాయ‌ ప‌న్ను రిట‌ర్న్ చెల్లించ‌డానికి చివ‌రి తేదీ జూలై 31


2016-17 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను ఆదాయ‌ప‌న్ను రిట‌ర్న్ చెల్లించ‌డానికి చివ‌రి తేదీ జూలై 31. అంత‌కంటే ముందు ఉద్యోగులు తెలుసుకోవాల్సిన విష‌యాలు కొన్ని ఉన్నాయి. ఈ సంద‌ర్భంగా అంద‌రికీ తెలిసిన ఫారం 16తో పాటు ఫారం 26ఏఎస్ ఆవశ్య‌క‌త కూడా తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఫారం 16 కంపెనీ వాళ్లు అందజేస్తారు. ఇది మీ జీతంలో టీడీఎస్ (ట్యాక్స్ డిడెక్టెడ్ ఎట్ సోర్స్‌) మిన‌హాయించిన‌ట్లు కంపెనీ వారు ధ్రువీకరించే ప‌త్రం. ఇక ఫారం 26ఏఎస్ మాత్రం అన్ని ర‌కాల ప‌న్నులు చెల్లించిన‌ట్లు మీరే స్వ‌యంగా ధ్రువీక‌రించుకొని జారీ చేసే ప‌త్రం. దీన్ని ఆదాయ‌పు ప‌న్ను శాఖ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఈ రెండు ఫారాల‌తో ప‌న్ను దాఖ‌లు చేసేముందు ఒకసారి వాటిలో లెక్క‌లు స‌రితూగాయో లేదో చూసుకోండి. ఏదైనా తేడా వ‌స్తే త‌ర్వాత స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీలైతే కంపెనీ స‌హాయం తీసుకుని మీ టీడీఎస్ వివ‌రాల‌ను స‌రిపోల్చుకోండి.

  • Loading...

More Telugu News