: ఏపీలో నూరుశాతం ఓటింగ్: రిటర్నింగ్ అధికారి సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ నవ్యరాజధాని అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ముగిసింది. ఈ రోజు ఉదయం పదిగంటలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తొలి ఓటు వేశారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొన్నారు. నిర్ణీత గడువుకంటే ముందుగానే ఓటింగ్ ప్రక్రియ ముగిసినట్లు రిటర్నింగ్ అధికారి సత్యనారాయణ తెలిపారు. అమరావతిలో వంద శాతం ఓటింగ్ నమోదైనట్లు ప్రకటించారు. ఈ నెల 20న ఈ ఎన్నికకు సంబంధించి కౌటింగ్ ప్రక్రియ జరుగుతుంది.