: రేపు హైదరాబాద్ కు రానున్న బాలిక సాయి పూర్ణిమ.. ముంబై చేరుకున్న ఆమె తల్లిదండ్రులు!


హిందీ సీరియళ్ల ప్రభావంతో తాను నటినవ్వాలని కలలుగని, గత నెల ఏడవ తేదీ నుంచి కనిపించకుండా పోయిన సాయి పూర్ణిమను రేపు హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. పూర్ణిమ మ‌హారాష్ట్ర‌లో ఉన్న‌ట్లు తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ముంబై చేరుకున్నారు. కాసేప‌ట్లో అక్క‌డి పోలీసులు పూర్ణిమ‌ను ఆమె త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించ‌నున్నారు. అయితే, త‌న త‌ల్లిదండ్రుల‌ను క‌ల‌వడానికి పూర్ణిమ ఇష్టపడడం లేదని తెలుస్తోంది. గ‌త 40 రోజులుగా పూర్ణిమ త‌న పేరు మార్చుకుని మ‌హారాష్ట్ర‌లో తిరుగుతోంది. ఈ కేసులో ముంబై పోలీసులు మాట్లాడుతూ... కోర్టు ఆదేశాల ప్ర‌కారం పూర్ణిమ సాయిని బాచుప‌ల్లి పోలీసుల స‌మ‌క్షంలో ఆమె త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గిస్తామ‌ని అన్నారు. బాచుప‌ల్లి పోలీసులు మాట్లాడుతూ.. పూర్ణిమ అస‌లు ముంబైకి ఎలా వెళ్లిందో విచార‌ణ చేయాల్సి ఉంద‌ని చెప్పారు. 

  • Loading...

More Telugu News