: దర్శకుడు మాధుర్ భండార్కర్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ
`ఇందు సర్కార్` సినిమా దర్శకుడు మాధుర్ భండార్కర్‌కు రక్షణ కల్పిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నాగ్‌పూర్‌లో `ఇందు సర్కార్` సినిమా ప్రచారం కోసం వెళ్లిన మాధుర్‌ని హోటల్ నుంచి బయటకు రాకుండా కాంగ్రెస్ వాదులు అడ్డుకున్న నేపథ్యంలో ఆయనకు రక్షణ కల్పించాలని నిర్ణయించుకున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. 1975-77 అత్యవసర పరిస్థితి కాలం కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో తమ నాయకులు ఇందిరా గాంధీ, సంజయ్‌గాంధీలను తప్పుగా చూపించే అవకాశాలున్నాయనే కారణాలతో కాంగ్రెస్ వాదులు ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. ఇదిలా ఉండగా `ఈ సినిమాలో నేను ఎవరి గురించి తప్పుగా చూపించలేదు. ఒకవేళ ఆ ఉద్దేశమే ఉంటే వారి తప్పులన్నీ ఎండగడుతూ డాక్యుమెంటరీ తీసేవాణ్ని` అని మాధుర్ తెలిపారు.