: ఓటు ఎలా వేయాలో చంద్రబాబు వివరిస్తారు: కళా వెంకట్రావు
ఈ రోజు జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలో టీడీపీ సభ్యులంతా ఎన్డీయే అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కే ఓటు వేస్తారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. ఓటు ఎలా వేయాలో తమ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరిస్తారని అన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయడు ఉప రాష్ట్రపతి అయితే... అది మన తెలుగువారందరికీ గర్వకారణమని చెప్పారు. నాగావళి వరద వల్ల శ్రీకాకుళం జిల్లావాసులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. 10 మండలాలపై వరద ప్రభావం ఉంటుందని చెప్పారు. భారీ వర్షాల వల్ల శ్రీకాకుళంకు లక్ష క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.