: హడలిపోతున్న రాజకీయ నేతలు... సబర్వాల్ కి 'గో ఎహెడ్' చెప్పిన కేసీఆర్!


పోలీసుల విచారణలో భాగంగా కెల్విన్ గంటకో కొత్త పేరు చెబుతుంటే, విస్తుపోతున్న సిట్ పోలీసులు, అతని సెల్ ఫోన్ లో ఉన్న పలువురు రాజకీయ నేతల పిల్లలకూ నోటీసులు ఇచ్చి విచారించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో తమ వారసుల పేర్లు ఎక్కడ వస్తాయోనన్న ఆందోళనలో ఉన్న ఎంతో మంది పొలిటికల్ లీడర్స్, ఎక్సైజ్ పోలీసులపై తమ వంతు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.

ఇక ఇదే విషయాన్ని అకున్ సబర్వాల్, సీఎం కేసీఆర్ ముందుంచగా, ఆయన ధైర్యంగా ముందుకు సాగాలని, కేసులో ఎవరున్నా వదలవద్దని, సంకోచించాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. విచారణలో ఆటంకాలు ఎదురైతే, అండగా తానుంటానని భరోసా ఇచ్చిన కేసీఆర్, పెద్దవారు ఎవరున్నా వాళ్ల పేర్లు బయటకు తీయాలని కూడా ఆదేశించారు. ఇక మూడో జాబితాలో పలువురు ప్రముఖ రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారని, వారందరికీ నోటీసులు పంపాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. అయితే, వారు డ్రగ్స్ వాడినట్టు పక్కా సాక్ష్యాలు, ప్రాథమిక దర్యాఫ్తు తరువాతే పేర్లు బయట పెడతామని సిట్ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News