: ఆ హీరోయిన్లు వచ్చాకే డ్రగ్స్ దందా మొదలు: అశోక్ కుమార్ కీలక వ్యాఖ్యలు
తెలుగు సినీ పరిశ్రమలోకి ఉత్తరాది నుంచి హీరోయిన్ల రాక మొదలైన తరువాతే కాస్మొపాలిటన్ సిటీ కల్చర్ పెరిగి డ్రగ్స్ దందా విస్తరించిందని సినీ నటుడు, నిర్మాత అశోక్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వెలగపూడి సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, గతంలో ఈ తరహా సంస్కృతి తెలుగు చిత్ర పరిశ్రమలో లేదని చెప్పారు. ఎవరో చేసిన తప్పులను అందరిపైనా వేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో ఇరుక్కున్న ప్రముఖులు అతి తక్కువ మందే అయినా, టాలీవుడ్ మొత్తంపై తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తున్నారని, ఈ పద్ధతి సరికాదని మరో హీరో సుమన్ అన్నారు.