: ఆ ఆరుగురి పేర్లూ బయటకు వస్తే తెలుగు సినీ ఇండస్ట్రీ షేక్!


గత రాత్రి నుంచి కెల్విన్ ను స్వయంగా విచారిస్తున్న ఎక్సైజ్ ఈడీ అకున్ సబర్వాల్, తనకున్న ఎన్నో అనుమానాలను తీర్చుకున్నారని తెలుస్తోంది. విచారణ పూర్తి అయిన తరువాత మరో ఆరుగురికి నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ ఆరుగురి పేర్లూ బయటకు వస్తే, తెలుగు సినీ ఇండస్ట్రీ కంపిస్తుందని సిట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తీసి, దశాబ్దాలుగా చిత్ర నిర్మాణ రంగంలో ఉన్న నిర్మాతల వారసులు ఈ ఆరుగురిలో ఉన్నట్టుగా నిన్ననే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

వారి పేర్లపై లీకులు వచ్చినప్పటికీ, అధికారికంగా పేర్లు వెల్లడి కాలేదు. మరోవైపు తమ కుటుంబంలోని రానా, అభిరామ్ లను రచ్చకీడ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నిర్మాత దగ్గుబాటి సురేష్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దగ్గుబాటి కుటుంబం స్థాయిలోనే తెలుగు పరిశ్రమకు మూలస్తంభంగా ఉన్న మరో కుటుంబంలోని హీరో సోదరుడి పేరు కూడా ఈ జాబితాలో ఉందని, వారి పేర్లు బయటకు వస్తే సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు ఉంటాయని సిట్ వర్గాలు చెబుతున్నాయి. 

  • Loading...

More Telugu News