: హైదరాబాద్ కి రైల్ గాడీలో పోయేటందుకు పైసలున్న ప్రతోడూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటోడే!: కోట శ్రీనివాసరావు సరదా కబుర్లు
ఈ రోజు ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్న వేళ, తనకు ఎంతో పేరు తెచ్చిన తెలంగాణ యాసతో ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు డైలాగులు చెప్పి ఆకట్టుకున్నారు. "హైదరాబాద్ కి రైల్ గాడీలో పోయేటందుకు పైసలున్న ప్రతోడూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటోడే. ఆడిని ప్రజాస్వామ్యం అంటే ఏందిర బై అని అడిగినమనుకో, హైదరాబాద్ లో ఆడుండే హోటల్ పేరు చెబ్తడు. గిసుమంటి దమాక్ లేనోళ్లందరూ నాతానకు వచ్చి, నాకు సీటీ గావాలే, నాకు సీటీ గావాలే అని సంపుకుతింటాండ్రు. నేనేం జెయ్యాలే?" అంటూ డైలాగ్ చెప్పారు. 'మండలాధీశుడు' చిత్రం తీసినప్పుడు, బెజవాడ రైల్వే స్టేషన్ లో తనను కిందపడేసి కొట్టారని గుర్తు చేసుకున్నారు.