: బంజారాహిల్స్ లో రెచ్చిపోయిన పోకిరీలు.. యువతిని చుట్టుముట్టి వేధింపులు
హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్ నెంబరు 12లో కొంతమంది పోకిరీలు రెచ్చిపోయారు. రోడ్డుపై వెళుతున్న ఓ యువతిని అడ్డుకుని, చుట్టుముట్టి వేధించారు. అయితే, ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. ఇంతలో ఆ రోడ్డుపై వెళుతున్న ప్రయాణికులు అంతా అక్కడకు వస్తుండడంతో ఆ యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
ఆ సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల్లో... రోడ్డుపై ఓ యువతి వెళుతోంది. అదే సమయంలో కొంతమంది యువకులు టూ వీలర్లపై వెళుతూ నడిరోడ్డుపై ఆగారు. ఆ యువతి ముందు బైక్‌ను ఉంచి అడ్డగించారు. మొత్తం ఆరుగురు యువకులు ఆ యువతిని టీజ్ చేశారు. ధైర్యవంతురాలైన ఆ యువతి ప్రతిఘటించింది. ఆ రోడ్డుపై వెళుతున్న వాహనదారులు విషయాన్ని గమనించి అక్కడకు చేరుకుంటుండడంతో ఆ అమ్మాయిని వారు విడిచిపెట్టి వెళ్లిపోయారు.