: చేతబడి జరిగిందని చర్చిలో నిర్బంధించిన బంధువులు.. ప్రాణాలు కోల్పోయిన మహిళ
పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూఢ నమ్మకాలకు ఓ మహిళ ప్రాణం కోల్పోయింది. దుష్టశక్తుల విరుగుడు పేరుతో ఓ మహిళతో ఆమె బంధువులు ఓ చర్చిలో ఐదు రోజుల పాటు రాత్రింబవళ్లు ప్రార్థనలు చేయించారు. ఆమెపై ఎవరో చేతబడి చేశారని, ఈ దీక్షచేయాల్సిందేనని చెప్పారు. ఆహారం, మంచినీళ్లు ఇవ్వకుండా కఠినంగా వ్యవహరించారు. చర్చిలోంచి ఆమెను బయటకు రానివ్వలేదు. దీంతో రోజురోజుకీ నీరసించి పోయిన ఆ మహిళ చివరకు చర్చిలోనే కన్నుమూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.