: నిద్రిస్తూ కిటికీలోంచి పడిపోయి.. విద్యార్థి మృతి
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ గురుకుల పాఠశాలలో ఈ రోజు తెల్లవారు జామున విషాద ఘటన చోటుచేసుకుంది. మొదటి అంతస్తులో నిద్రిస్తున్న పిల్లల్లో రాకేష్ అనే విద్యార్థి కిటికీలోంచి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. తమ పాఠశాలలో గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయని, అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
రాత్రి కిటికీ పక్కన పడుకొని నిద్రలో పక్కకు జరిగిన రాకేష్ ఆ కిటికీకి చువ్వలు లేకపోవడంతో కింద పడిపోయాడని ఇతర విద్యార్థులు మీడియాకు తెలిపారు. తమ పాఠశాల నిర్వహణ విషయంలో అధికారులు దృష్టి సారించాలని కోరారు. రాకేష్ స్వస్థలం కోటపల్లి మండలం కొండంపేట అని పోలీసులు చెప్పారు. ఈ పాఠశాలలో ఆ బాలుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడని తెలిపారు.