: సినీ ప్రముఖులను ప్రభుత్వం కాపాడుతోంది: బీజేపీ ఆందోళన


టాలీవుడ్ లోని పలువురికి ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ నుంచి నోటీసులు అందిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 12 మందికి నోటీసులు అందగా... మరి కొందరి పేర్లతో రెండో జాబితా రెడీ అవుతోందనే వార్త ప్రకంపనలు పుట్టిస్తోంది. అయితే, ప్రభుత్వ పెద్దలతో కొందరు తెరవెనుక మంతనాలు జరిపి... తమ పేర్లు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

 ఈ నేపథ్యంలో బీజేవైఎం కార్యకర్తలు నేడు హైదరాబాదులోని ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ముందు బైఠాయించి, ఆందోళనకు దిగారు. డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకున్న సినీ ప్రముఖులను తెలంగాణ ప్రభుత్వం కాపాడుతోందని వారు ఆరోపించారు. డ్రగ్స్ కేసుల్లో ఉన్నవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 

  • Loading...

More Telugu News