: బుట్టా రేణుకపై జగన్ ఆగ్రహం.. అరగంటలో ముగిసిన వైసీపీ ఎంపీల సమావేశం
హైదరాబాదులో నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కేవలం 30 నిమిషాల్లోనే ఈ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా తమ ఎంపీల పని తీరు పట్ల జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ముఖ్యంగా ఈ సమావేశానికి హాజరుకాని కర్నూలు ఎంపీ బుట్టా రేణుకపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. అంతేకాకుండా మంత్రి నారా లోకేష్ ను నిన్న ఆమె కలవడంపై మండిపడ్డారని తెలుస్తోంది. పార్టీలో ఉన్నప్పుడు కొన్ని నియమనిబంధనలను పాటించాల్సి ఉంటుందని జగన్ అన్నట్టు సమాచారం. ప్రజలతో మమేకం కావాలని, సొంత వ్యాపారాలకు దూరంగా ఉండాలని ఎంపీలకు జగన్ సూచించారట.