: రీఛార్జీ కోసం నెంబర్ చెప్పనక్కర్లేదు.... మహిళలకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన వొడాఫోన్
ఇక నుంచి మహిళలు రీఛార్జీ కోసం రిటైలర్‌కు తమ మొబైల్ నంబర్ చెప్పనక్కర్లేదు. `వొడాఫోన్ సఖి` ప్లాన్‌తో ప్రైవేట్‌గా రీఛార్జీ చేసుకునే సౌకర్యాన్ని వొడాఫోన్ కల్పించింది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ (పడమర), ఉత్తరాఖండ్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ ఆఫర్‌ను త్వరలో దేశవ్యాప్తం చేయనున్నారు.
రీఛార్జీ చేసుకోవాలనుకున్నపుడు `ప్రైవేట్` అని 12604కి మెసేజ్ చేస్తే ఒక వన్‌టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. 24 గంటల్లోగా దాన్ని ఏదైనా రిటైల్ షాపులో చెప్పి తమ నెంబర్ బహిర్గతం చేయకుండానే రీఛార్జీ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ అందరికీ తెలియడం కారణంగా గ్రామీణ ప్రాంత మహిళలు ఎక్కువగా మానసిక వేధింపులకు గురవుతున్నారు. ఈ సఖి సౌకర్యం ద్వారా అలాంటి వేధింపులను అరికట్టవచ్చు. దీంతో పాటు ప్రత్యేకంగా మహిళల కోసం రూ. 52, రూ. 78, రూ. 99 రీఛార్జీ ప్యాక్‌లను వొడాఫోన్ ప్రవేశపెట్టింది.