: జగన్ సమావేశానికి బుట్టా రేణుక డుమ్మా.. లోకేష్ కార్యక్రమానికి హాజరు.. ఏం జరుగుతోంది?
వైసీపీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. ఈ రోజు హైదరాబాదులో వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన లోటస్ పాండ్ లో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి రేణుక డుమ్మా కొట్టారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి రేణుక హాజరుకాకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే సమయంలో, నిన్న కర్నూలు పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ ను ఆమె కలిశారు. దీంతో, ఆమె పార్టీ మారడం ఖాయమని అంటున్నారు.