: తెలంగాణలో 39 ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత డయాలసిస్ సేవలు... అభినందించిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 39 ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత డయాలసిస్ సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న విషయంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ ద్వారా స్పందించారు. ఆరోగ్య శాఖను ప్రశంసిస్తూ ఆయన ట్వీట్ చేశారు. జర్మనీకి చెందిన డీ మెడ్ కంపెనీ సహకారంతో మూత్రపిండాల సంబంధిత వ్యాధిగ్రస్తుల కోసం 269 డయాలసిస్ యంత్రాలను 39 ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం కింద ఒక్కో డయాలసిస్ యంత్రానికి రూ. 1,375 ప్రభుత్వం వెచ్చించనుంది. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు ముఖ్యమైన ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో ఈ యంత్రాలను ఉంచనున్నారు.