: ఇన్నాళ్లూ జగన్ వేరట.. ఇప్పడు చూసిన జగన్ వేరట
అందరూ ఊహించినట్లుగానే టీడీపీ మాజీ నేత దాడి వీరభద్రరావు వైఎస్సార్ కాంగ్రెస్ పంచన చేరుతున్నట్లు తెలిపారు. అన్నట్లుగానే చంచల్ గూడ జైలులో జగన్మోహన రెడ్డిని ఈ ఉదయం తన కుమారుడు రత్నాకర్ రావుతోపాటు కలిసిన తర్వాత వైఎస్సార్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
"ఇన్నాళ్లూ నేను విన్న జగన్ వేరు. ఇప్పుడు చూసిన జగన్ వేరు" అని దాడి స్టేట్మెంట్ ఇచ్చేశారు. తెలుగుదేశం పార్టీ విధానాల మేరకే తాను గతంలో వైఎస్ కుటుంబంపై ఆరోపణలు చేశానన్నారు. అప్పట్లో జగన్ గురించి తెలియదని, ఇప్పుడు తెలుసుకున్నాని చెప్పారు. పనిలోపనిగా జగన్ జైలులో ఉన్నా ప్రజలకు సేవ చేయాలన్న కసి ఆయనలో కనిపించిందని దాడి చెప్పారు. అంతలోనే దాడిలో ఎంత మార్పో..!