: అకున్ సబర్వాల్ లీవ్ పై వెళ్లడం వెనుక సినీ ఇండస్ట్రీ పెద్దల హస్తం లేదు!: సీనియర్ సినీనటుడు నరేష్
డ్రగ్స్ వ్యవహారంలో సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు నోటీసులు అందాయనే వ్యవహారంపై ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ నటుడు నరేష్ పాల్గొన్నారు. ‘ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ లీవ్ లో వెళ్లనుండటం వెనుక సినీ ఇండస్ట్రీ పెద్దల హస్తం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి, నిజమేనా?’ అని ప్రశ్నించగా .. నరేష్ స్పందిస్తూ, ‘డ్రగ్స్ కేసు వ్యవహారం విషయమై గవర్నమెంట్ కు తెలియకుండా ఎక్సైజ్ శాఖ ఈ పని చేయదు. హైదరాబాద్ సిటీ అనేది క్లీన్ గా ఉండాలనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. మమ్మల్ని చూపి ప్రభుత్వం భయపడిందా? లేక పోలీస్ డిపార్ట్ మెంట్ మమ్మల్ని చూసి భయపడిందా? మాకు ఏ అధికారం, ఎలాంటి పవర్స్ ఉన్నాయి, వారిని భయపెట్టడానికి? అకున్ సబర్వాల్ లీవ్ పై వెళ్లడం వెనుక సినీ ఇండస్ట్రీ పెద్దల హస్తం ఉందనేది కరెక్టు కాదు’ అని చెప్పుకొచ్చారు.