: 'హసీనా: ది క్వీన్ ఆఫ్ ముంబయి’ నుంచి మరో కొత్త పోస్టర్


అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘హసీనా: ది క్వీన్ ఆఫ్ ముంబయి’. హసీనా పాత్రను శ్రద్ధాకపూర్ పోషిస్తోంది. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన మరో కొత్త పోస్టర్ ని శ్రద్ధాకపూర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే, గతంలో విడుదల చేసిన పోస్టర్ లో కేవలం హసీనా పాత్రధారి శ్రద్ధాకపూర్ మాత్రం ఉంది. కానీ, తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో భర్త ఇబ్రహీం పార్కర్ పాత్రధారి అంకూర్ భాటియా, నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘హసీనా: ది క్వీన్ ఆఫ్ ముంబయి’లో దావూద్ సోదరుడి పాత్రను శ్రద్ధాకపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ పోషిస్తున్నాడు.

  • Loading...

More Telugu News