: రేపు గాజువాకలో కలుద్దాం!: హీరోయిన్ త‌మ‌న్నా


టాలీవుడ్, కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి తమన్నా ప్రస్తుతం విక్రమ్‌కు జంటగా 'స్కెచ్‌' చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు తెలుగులోనూ రెండు చిత్రాలలో షూటింగ్‌లో పాల్గొంటోంది. ఇటీవ‌లే ఈ అమ్మ‌డుకి ఆమె కుటుంబ స‌భ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి.

ఇక, ఈ అమ్మ‌డు రేపు విశాఖ‌ప‌ట్నంలోని గాజువాకకి వెళ్ల‌నుంద‌ట. ఈ విష‌యాన్ని ఆమె త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపింది. రేపు గాజువాక‌లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో పాల్గొన‌బోతున్నాన‌ని, అక్క‌డ క‌లుద్దామ‌ని త‌న అభిమానుల‌కు చెప్పింది. దీంతో 'నీ కోసం మాత్ర‌మే అక్క‌డ‌కు వ‌స్తాను త‌మ‌న్నా' అంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News