: నాకు డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం లేదు... వార్తలు రాసే ముందు నన్ను అడగండి!: మొమైత్ ఖాన్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారిన డ్రగ్స్ వ్యవహారంపై మీడియాలో తన పేరు వస్తుండడం పట్ల సినీ నటి మొమైత్ ఖాన్ స్పందించింది. ఏ విషయంలోనైనా ఆధారాలు లేకుండా ఎవ్వరినీ నిందించకూడని హితవు పలికింది. డ్రగ్స్ కేసులో తనకు సంబంధం ఉందని వస్తోన్న వార్తల్లో నిజం లేదని వ్యాఖ్యానించింది. తనకు ఎలాంటి నోటీసులూ రాలేదని తెలిపింది. తాను తన పనిలో బిజీగా ఉన్నానని చెప్పింది. తాను ఏ విషయాన్నైనా నిజమైతే నిజమని చెబుతానని, అబద్ధమైతే అబద్ధమనే చెబుతానని వ్యాఖ్యానించింది. తన గురించి వార్తలు రాసేముందు తనను సంప్రదించి, కన్ఫామ్ చేసుకున్న తరువాతే రాయాలని హితవు పలికింది. తాను డ్రగ్స్ తీసుకునే వ్యక్తిని కాదని పేర్కొంది. తన పేరును మీడియాలో చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని ఆమె నవ్వుతూ చెప్పడం విశేషం.