: డ్రగ్స్ వ్యవహారం: హఠాత్తుగా ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి వచ్చిన నటుడు నందు
డ్రగ్స్ వ్యవహారంలో పేరు ఉన్న సినీ ప్రముఖులను ఈ నెల 19 నుంచి 25 వరకు హైదరాబాద్‌లోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో విచారించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రముఖ నటుడు నందుకి కూడా సిట్ నోటీసులు పంపించిందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ రోజు నందు హఠాత్తుగా ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి వచ్చాడు. ఆ కార్యాలయంలో అధికారులు ఎవ్వరూ లేకపోవడంతో వెనుదిరిగాడు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ... తనకు అసలు పోలీసుల నుంచి ఎటువంటి నోటీసులు రాలేదని అన్నాడు. తన పేరు ఎందుకిలా బయటకు వచ్చిందో తెలుసుకుందామని అక్కడకు వచ్చానని తెలిపాడు.