: సింగపూర్ లో ప్రవాస భారతీయునికి మరణశిక్ష అమలు!
2014లో 22.24 గ్రాముల డయామార్ఫీన్ మత్తుపదార్థం రవాణా చేస్తూ పట్టుబడ్డ భారత సంతతికి చెందిన ప్రభాగరన్ శ్రీవిజయన్‌కు శుక్రవారం సింగపూర్‌లో మరణశిక్ష అమలు చేశారు. ఐక్యరాజ్యసమితి, ఇతర సామాజిక సంస్థలు మరణశిక్షను ఆపాలని పట్టుబడుతున్నా వినకుండా ప్రభాగరన్కు శిక్ష అమలు చేశారు. సింగపూర్‌లోని చంఘీ ప్రిజన్ కాంప్లెక్స్‌లో అతణ్ని ఉరి తీసినట్లుగా సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో తెలిపింది. 15 గ్రాముల కంటే ఎక్కువ డయామార్ఫీన్తో పట్టుబడితే సింగపూర్ చట్టం ప్రకారం మరణశిక్ష విధిస్తారు. ప్రభాగరన్ 22.24 గ్రాములతో పట్టుబడటం వల్ల అంతర్జాతీయ సంస్థలైన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.