: చార్మి, ముమైత్ గురించి నేనేమీ మాట్లాడను: అకున్ సబర్వాల్
డ్రగ్స్ కేసులో సిట్ పోలీసుల నుంచి టాలీవుడ్ నటీమణులు చార్మీ, ముమైత్ ఖాన్ లు నోటీసులు అందుకున్నారని వస్తున్న వార్తలపై స్పందించేందుకు ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ నిరాకరించారు. వారి గురించి తానేమీ మాట్లాడబోనని స్పష్టం చేసిన ఆయన, ఇప్పటివరకూ 8 మందికి మాత్రమే నోటీసులు వెళ్లాయని, మరికొందరికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తాము ఎవరి పేర్లను బహిర్గతం చేయలేదని, మీడియాలో వస్తున్న పేర్లకు, తమకు సంబంధం లేదని అన్నారు. తామిచ్చిన నోటీసుల్లోనే వారు ఏ తేదీన, ఏ సమయంలో హాజరు కావాలన్న విషయమై స్పష్టంగా చెప్పామని అన్నారు.