: పూరి, రవితేజ లకు జీశాన్ అనే నైజీరియన్ నుంచి అందితే... చార్మీ, సుబ్బరాజులకు డ్రగ్స్ ఇచ్చింది పూరీ జగన్నాథే!
కలకలం రేపుతున్న డ్రగ్స్ దందాకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు టీవీ చానళ్లు, సిట్ కార్యాలయంలోని తమకు పరిచయస్తులైన వ్యక్తుల నుంచి వివరాలు సేకరించి, తమ తమ చానళ్లలో బహిర్గతం చేస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు, తొలుత అరెస్ట్ అయిన కెల్విన్ నుంచి పూరీ జగన్నాథ్ స్వయంగా మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసే వాడని పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి.
పూరీ డ్రగ్స్ కొన్నట్టు స్పష్టమైన ఆధారాలు వుండగా, ఆయన నుంచి హీరోయిన్ చార్మీ, క్యారెక్టర్ నటుడు సుబ్బరాజులకు ఇచ్చినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇక జీశాన్ అనే నైజీరియన్ నుంచి హీరో రవితేజకు పలుమార్లు డ్రగ్స్ వెళ్లాయని సిట్ అధికారులు నిర్ధారించుకున్నారు. ఆ తరువాతే రవితేజకు నోటీసులు పంపాలని నిర్ణయించారు. ఈ కేసులో మరింతమంది ప్రముఖుల పేర్లు ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినీ ప్రముఖుల్లో మిగిలిన వారికి నోటీసులు ఇచ్చేందుకు సిట్ రెండో జాబితాను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.