: మాపై తప్పుడు ప్రచారం... కోచ్ ఇంటర్వ్యూ ప్రక్రియను బయట పెట్టాలని సచిన్, గంగూలీ, లక్ష్మణ్ డిమాండ్!


భారత క్రికెట్ జట్టుకు మేలు చేయాలన్న ఉద్దేశంతో తామెంతో శ్రమించి ప్రధాన కోచ్, సహాయక కోచ్ లను ఎంపిక చేస్తే, తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందని దిగ్గజ త్రయం సచిన్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పూర్తి పారదర్శకంగానే ఎంపిక జరిగిందని, ఈ మొత్తం ప్రక్రియను బయట పెట్టాలని సీఓఏ (పాలకుల కమిటీ)కి ఘాటైన లేఖను వారు రాయడం ఇప్పుడు కలకలం రేపుతోంది.

తాము పరిధులు దాటినట్టు పాలకుల కమిటీ పేర్కొందని వార్తలు రావడంపై వీరు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రవిశాస్త్రిని సంప్రదించిన తరువాతనే ద్రావిడ్, జహీర్ ల పేర్లను చెప్పామని వీరు తెలిపారు. ఇదే విషయాన్ని సీఓఏ సభ్యులైన వినోద్ రాయ్, రాహుల్ జోహ్రీ, అమితాబ్ చౌదరిలకు కూడా చెప్పామని, సున్నితమైన వ్యవహారాన్ని నిబద్ధతతో పూర్తి చేస్తే, తమపై అసత్య ప్రచారం చేస్తుండటం బాధను కలిగిస్తోందని ఈ లేఖలో సెలక్షన్ కమిటీ పేర్కొంది. అపోహలను తొలగించాలని, ఆ బాధ్యత మీదేనని సీఓఏకు హితవు పలికింది.

  • Loading...

More Telugu News